ఆర్మూర్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారత పద్మశాలి సంఘం కౌన్సిల్ మెంబర్‌గా దాసరి నర్సిములు ఎంపికైన సందర్భంగా ఆర్మూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గంగాధర్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు చౌకె లింగం, ఆర్మూర్ 5 వ వార్డు కౌన్సిలర్, ఆర్మూర్ మండల ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్‌లు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
అలాగే నిజామాబాద్‌కు చెందిన అశోక్‌ను కూడా సన్మానించారు. తర్వాత బొడ్డు గంగాధర్, చౌకె లింగం, బండారి ప్రసాద్‌లు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పద్మశాలీలు వర్గ విభేదాలు వీడి ఒకే వేదికపైకి రావడానికి తన వంతు కృషి చేయాలని కోరారు. భీష్మాచార్యుడి వంటి అనుభవం కలిగిన పద్మశాలి ముద్దుబిడ్డ దాసరి నర్సిములు జిల్లా స్థాయిలో ఉన్న రెండు వర్గాలను కలిపి పద్మశాలీల ఐక్యతను నిలబెట్టాలని, విభేదాలను విడిచిపెట్టి ఐక్యవేదికగా నిలబడడానికి సంధానకర్తగా దాసరి నర్సింలు వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేష్, 5వ తర్ప అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్, గుజ్జేటి రాము, రాజేంధర్ తదితరులు పాల్గొన్నారు.