కామారెడ్డి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే హరిత హారంలో పెద్ద మొక్కలు నాటడానికి కావలసిన మొక్కల కోసం మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు.
మున్సిపాలిటీల వారీగా, మండలాల వారీగా పెద్ద మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను పెంచుతున్నామని పేర్కొన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, డిఎఫ్‌వో నిఖిత, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, రమేష్ కుమార్, జగ్జీవన్ పాల్గొన్నారు.