నిజామాబాద్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పాన్ ఇండియా కార్యక్రమం, గడప గడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమంలో బాగంగా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిని ఉద్దేశించి ప్యానల్ అడ్వకేట్ జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో చాలామందికి న్యాయ స్థానాలు మీద అవగాహన లేదని, బడుగు బహీన వర్గాల ప్రజలు అపోహతో ఉన్నారన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 39 ఎ అందరికీ సమ న్యాయం జరగాలని, అందుకు ఉచితంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వారికి ఉచిత న్యాయ సేవ చేయడం జరుగుతుందని తెలిపారు.
అదే విధంగా సీనియర్ సిటిజన్ ఆక్ట్, ఫోక్ సో ఆక్ట్, లేబర్ ఆక్ట్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. డిఎల్‌ఎస్‌ఏ సేవలను వినియోగించు కోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడివో సాజిద్ అలి, సర్పంచ్ రామ దేవి, కార్యదర్శి రాము గౌడ్, ప్యానల్ న్యాయవాది పిల్లి శ్రీకాంత్, ఉప సర్పంచ్ రాములు, మహిళ సంఘాల వనిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.