నిజామాబాద్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూముల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త విచారణ త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి రెవిన్యూ, ఫారెస్ట్ జాయింట్ ఇన్స్‌పెక్షన్ చాలా వరకు పూర్తి అయ్యిందని, మిగిలి ఉన్న దాన్ని తొందరలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలప స్మగ్లింగ్ కంట్రోల్ పైన, ఫారెస్ట్, రెవిన్యూ ల్యాండ్స్ భూముల విషయంలో క్లారిటీ రావాలన్నారు. ఫారెస్ట్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా రికార్డులను సరి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్లారిటీగా ముందుకు వెళ్లాలంటే ముందుగా మనం క్లారిటీగా ఉండాలన్నారు.
సమావేశంలో డి.ఎఫ్.ఒ సునీల్, అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మకరంద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.