కామారెడ్డి, అక్టోబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామానికి చెందిన, కమ్మరి కవితకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కవిత (23) కి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కామారెడ్డి సమీపంలో ఆమెకు అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది చాలా చాక చక్యంగా సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్డలను కాపాడారు. రెండవ కాన్పు కావడంతో మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్యసేవల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డిలో చేర్పించినట్లు సిబ్బంది తెలిపారు. సరిjైున సమయంలో వైద్య సేవలు అందించి, తల్లి బిడ్డలను కాపాడిన 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి- అంజయ్య, పైలట్- రామశంకర్‌లను ఆమె భర్త అశోక్, గుడిమెట్, గ్రామస్తులు పలువురు అభినందించారు.