ఆర్మూర్, అక్టోబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం ఆర్మూర్ పట్టణములోని వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపములో క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్- సంగీతా ఖాందేష్ కౌన్సిలర్ దంపతుల ఆధ్వర్యములో సామూహిక ఉపనయన సంస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి విచ్చేసి ఉపనయనం స్వీకరించిన చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మున్సిపల్ కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, అయ్యప్ప శ్రీనివాస్, లిక్కి శంకర్, వనం శేఖర్, రింగుల భూషణ్, లింగంపల్లి శివ, ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ప్రధాన కార్యదర్శి బారాడ్ గంగామోహన్, ఉపాధ్యక్షులు రెడ్డి ప్రకాష్, కర్తన్ దినేష్, సభ్యులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిల్క కిష్టయ్య, న్యాయవాదులు జక్కుల శ్రీధర్, గటడి ఆనంద్ జిజి రామ్ ఖాందేష్ సత్యం, రాము తదితరులు పాల్గొన్నారు.