ఆర్మూర్, అక్టోబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో బొడ్డు శ్రవణ్ కుమార్కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నరసయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు.
ఈ సందర్బంగా బొడ్డు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని బీసీ కులాలను, అక్కడున్న కులాలను కులవృత్తులను బీసీ వర్గాలను చైతన్యవంతులుగా బీసీ సంఘాల విద్యార్థి వారికి ఎల్లవేళలా ఎటువంటి సహాయం అవసరమైన తన సహాయ సహకారాలు ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం తరపున తాను ఎల్లవేళలా పోరాడుతానని అదేవిధంగా ప్రతి గ్రామాలలోని రైతులకు, ఉద్యోగుల యువకులకు, మహిళలకు, విద్యార్థులకు ఎటువంటి అవసరమైన వారికి తోడుగా ఉంటానని ఈ సందర్బంగా తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నరసయ్య, నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంగం అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉట్నుర్ సత్యగౌడ్, నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గగ్గుపల్లి శ్యామ్, బిసి సంక్షేమ సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు ఉప్పునూతల రాజగౌడ్, ఆర్మూరు బిసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గోజూర్ మైపాల్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.