నిజామాబాద్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీని వెంచర్స్ ధర్మారం నందు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అగ్రిమెంట్ ప్రకారం మౌలిక వసతులు కల్పించకుండా మోసం చేసిన శ్రీని వెంచర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శ్రీని వెంచర్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌కి మెమోరాండం సమర్పించారు. తక్షణమే ఈ అంశంపై పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
మౌలిక సదుపాయాలైన కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, గ్రామ పంచాయతీ ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించకుండా శ్రీను వెంచర్స్ అడ్డగోలుగా ప్లాట్లను మధ్యతరగతి ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు అమ్మినట్లు ప్రతినిధులు ఆరోపించారు. అగ్రిమెంట్ ప్రకారం ఫ్లాటు యజమానులకు కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకుండా యాజమాన్యం ప్లాటు యజమానులకు ప్రభుత్వాన్ని మోసం చేసిందని వీటితో పాటుగా అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్‌లు కూడా చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ పూర్తి శ్రీని వెంచర్స్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇలాంటి వెంచర్స్ జిల్లాలో ఇంకా చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తతతో ఉండాలని వారు ప్రజలను కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు, శ్రీని ప్లాటు యజమానుల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రామదాస్, ప్రధాన కార్యదర్శి కె.సి. లింగం, కోశాధికారి కే. సాయిలు, కమిటీ నాయకులు సునీల్ కుమార్, సుకున్ తదితరులు ఉన్నారు.