నిజామాబాద్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాన్ ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా నవీపేట్ మండలం బినొల గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామ ప్రజలు మన సంస్కృతి ఉద్దేశించి డిఎల్‌ఎస్‌ఏ పనల్ న్యాయవాది జగన్ మోహన్ గౌడ్ మాట్లాడారు.
రాజ్యాంగం నిర్దేశించిన సమాన న్యాయం పౌరులందరికీ న్యాయాధికారి సేవా సంస్థ ద్వారా అధికార సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు చట్టాలపై అవగాహన ప్రచారం నిర్వహిస్తున్నట్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చట్టాల పట్ల అవగాహన చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే. పీతాంబర్, ఉపసర్పంచ్ పి పోశెట్టి, గ్రామ కార్యదర్శి ఇఎస్ కిషోర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, లీగల్ వాలింటర్ రఘునాత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నందిగామ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె లావణ్య, గ్రామ కార్యదర్శి కృష్ణవేణి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మధ్యపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ రేణుక, ఉపసర్పంచ్ మూడ మంగీలాల్, గ్రామ కార్యదర్శి పి కళ్యాణి, సభ్యులు బానవత్ రవి, వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు. అల్జాపూర్ ఖర్రాబాద్ గ్రామాలలో గడపగడపకు కరపత్రాలతో అవగాహన ప్రచారం నిర్వహించారు.