డిచ్‌పల్లి, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.కనకయ్య అధ్యక్షన డీన్స్ సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా పలు అంశాలు చర్చించినట్టు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి టీచింగ్ స్టాఫ్ (రెగ్యులర్, అకాడమిక్ కన్సల్టెంట్స్) నాన్ టీచింగ్ (రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) కి బయోమెట్రిక్ అటెండెన్సు ఉంటుందని, యూనివర్సిటీలో పీజీ ఇంటెక్ సీట్స్ 30 నుండి 50 పెంపు, ఎక్సామినేషన్ బ్రాంచ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సలహా మేరకు అవసరమైన సిబ్బంది (మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్ మరియు సారంగపూర్) ని నియమించడం అంశంపై చర్చించారు. వివిధ విభాగాల్లో అవసరమైన పార్ట్ టైం టీచింగ్ సిబ్బంది, ఈసీ సభ్యుల, ఎక్సటర్నల్‌గా వచ్చే ఎక్సమినర్స్, పి.హెచ్.డి వైవ కొరకు వచ్చే వారికి గౌరవ వేతనం (హానరేరియమ్) పెంపు గురించి చర్చించారు.