వేల్పూర్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు నగరం మహేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కార్యక్రమములో తెరాస నాయకులు, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.