నిజామాబాద్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో వార్డుల వారిగా టీమ్స్ నియమించి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు.
హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లతో వ్యాక్సినేషన్‌పై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ జిల్లాలో వ్యాక్సినేషన్ కొరకు తీసుకుంటున్న చర్యలపై సిఎస్‌కు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో మండల్ లెవెల్ టీమ్స్ ద్వారా లోకల్ అథారిటీలలో స్థానిక అధికారుల ద్వారా ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా మోటివేట్ చేస్తున్నామని తెలిపారు.
కొందరు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో అట్లాంటి వారికి స్పెషల్‌గా మాట్లాడి వ్యాక్సినేషన్ చేయించుకునే విధంగా చైతన్య పరుస్తున్నామన్నారు. బుధవారం నుండి అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రెటరీలు, వీఆర్వోలను భాగస్వామ్యం చేస్తూ నిర్ణీత సమయంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. సెకండ్ డోస్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ గోవింద్, ఇన్చార్జి డీఎంహెచ్‌వో సుదర్శనం, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.