డిచ్‌పల్లి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం డైరెక్టర్‌గా తెలుగు అధ్యయన విభాగం అసోసియేట్ ప్రోఫ్రెసర్ డాక్టర్ జి. బాల శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్తా ఆదేశాలమేరకు రిజిస్ట్రార్ ఆచార్య పి. కనకయ్య బుధవారం డాక్టర్ బాల శ్రీనివాస మూర్తికి నియామక పత్రాన్ని అందచేశారు.
తనకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా భాద్యతలు అప్పగించడంపై డాక్టర్ బాల శ్రీనివాస మూర్తి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ ఆచార్య పి. కనకయ్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని ఆయన చెప్పారు. డాక్టర్ బాల శ్రీనివాస మూర్తికి పోటీ పరీక్షల రంగంలో విశేషమైన అనుభవముంది. జాతీయ అర్హత పరీక్ష (నెట్- జె. ఆర్.ఎఫ్), గ్రూప్ -2 తో పాటు పలు అంశాలపై ఆయన గతంలో పలు గ్రంథాలు రచించారు. ఇదివరకు కూడా విశ్వవిద్యాలయ పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్ భాద్యతలు సమర్దవంతంగా నిర్వహించారు. డాక్టర్ బాల శ్రీనివాస మూర్తికి పలువురు ఆచార్యులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.