కామారెడ్డి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో చైన్ స్నాచింగ్ జరిగింది. వివరాల్లోకి వెళితే లక్ష్మి అనే మహిళ ఎర్రపహాడ్ గ్రామ పిహెచ్సి సెంటర్లో విధులు నిర్వహించుకొని కామారెడ్డిలో ఉన్న తన నివాసానికి అతిసమీపంలో లక్ష్మీ మెడలో నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి రెండున్నర తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని బైక్ పై పరారయ్యారు.
బంగారు గొలుసు లాగే సమయంలో లక్ష్మీ ప్రతిఘటించి గొలుసు పట్టుకున్నా ఇద్దరు వ్యక్తులు బలంగా ఉండడంతో గొలుసులు లాక్కెళ్లారు. చైన్ లాగే సమయంలో లక్ష్మీ మెడకు గాయమై కిందపడి గాయాలయ్యాయి. స్థానికులు వచ్చే లోపల దొంగలు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్హెచ్ఓ మధుసూదన్, ఇతర పోలీసులు వచ్చి వివరాలు తెలుసుకొని విచారణ చేపట్టారు.