వేల్పూర్, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు 23 వేల 400 రూపాయల విలువైన మధ్యాహ్న భోజన వంట పాత్రలను మోతే గ్రామానికి చెందిన నక్క మోహన్ యాదవ్, ఎస్‌ఎన్ అఫ్రోజ్ వితరణ చేశారు. ఈ సందర్భంగా మోతే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగన్న మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన నక్క మోహన్ యాదవ్ వారి తండ్రి స్వర్గీయ పెద్ద రాజన్న, ఎస్‌ఎన్ అఫ్రోజ్ తండ్రి స్వర్గీయ బాబుమియా జ్ఞాపకార్థం తమ పాఠశాలలకు 23 వేల 400 రూపాయల విలువైన వంట సామాను కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందన్నారు.
తమ పాఠశాలకు గ్రామస్తులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనేక విధాలుగా సహాయం చేస్తున్న వారందరికీ పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా దాతలు, మాజీ వేల్పూర్ జెడ్పిటిసి వసంత్ గౌడ్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డోల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో తమ పాఠశాలకు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉన్నదని అన్నారు.
తాము చదువుకున్న పాఠశాలకు ఎంత చేసినా తక్కువేనని వారు గుర్తు చేశారు. కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, వేల్పూర్ మండలం మాజీ జెడ్‌పిటిసి వసంత్ గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ డొల్ల రాజేశ్వర్ రెడ్డి, మోతే ప్రాథమిక సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి, మాజీ గ్రామ టిఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్, దాతలు, యువకులు పాల్గొన్నారు.