సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను టిఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులను సర్పంచ్‌ శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు, టిఆర్‌ఎస్‌ నాయకుల చేతులమీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చొరవతో అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రతి కుటుంబానికి నేనున్నాను అంటూ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయం నిధి కింద డబ్బులు మంజూరు చేయించి ఇప్పించడం జరుగుతుందన్నారు. లబ్ధి పొందిన వారిలో బాధితులు ఎం కె బాలయ్య 38 వేల 500 రూపాయలు, నూకల గౌరమ్మ 40 వేల 600 రూపాయలు, మోటర్‌ నాగరాజు 22 వేలు రూపాయలు, సిహెచ్‌ బాజమ్మ 60 వేల రూపాయలు, గోదా శారద 37 వేల 500 రూపాయల చొప్పున పంపిణీ చేశారు.

ఇందుకు సహకరించిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టిఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల మంజూరుకు సహకరించిన స్థానిక టిఆర్‌ఎస్‌ నాయకులకు, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి భారతి, రాకేష్‌ చంద్ర, సర్పంచ్‌ శ్వేతా గంగారెడ్డి, ఎంపీటీసీలు నోముల గంగారెడ్డి, గుడాల గంగాధర్‌, సొసైటీ చైర్మన్‌ రాజారెడ్డి, రైతు సమన్వయ సభ్యులు ఏలేటి రమేష్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం లింబారెడ్డి, కన్నెగారి సంజీవ్‌, అనుపమ సతీష్‌, నడిపోల్ల గంగాధర్‌, జిల్లా భూమన్న కార్యకర్తలు బాధితులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »