భీమ్గల్, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రంలోని పుణ్యక్షేత్రం అయిన శ్రీ లింబాద్రి గుట్టపైన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, గిరి ప్రదక్షణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు లింబాద్రి జాతర ప్రారంభం అయ్యే సమయం వరకు నాలుగు లైన్ల రోడ్డు, సెంటర్ లైటింగ్, గ్రినరి రోడ్డు పనులు పూర్తి కావాలని సూచించారు.
ఆయా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు బుధవారం సూపరింటెండిరగ్ ఏక్సిక్యూటివ్ ఇంజనీరింగ్ రాజేశ్వర్ రెడ్డి వారి బృదంతో కలిసి గుట్టపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏ.ఇ. సూపర్వైజర్లు పాల్గొన్నారు.