బాన్సువాడ, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం, వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో, బీర్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులు పండిరచిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని తెలిపారు.
కరోన కష్టకాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులనుండి రైతు పండిరచిన ధాన్యాన్ని కొనము అని చెప్పినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కాబట్టి, తెలంగాణ రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదు అని రైతు పండిరచిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వాన కాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ, రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదని ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 1960 రూపాయలకు, కామన్ గ్రేడ్ 1940 రూపాయలకు కొనుగోలు చేస్తుందని, రైతులు శుభ్రం చేసి తాలు, పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు.
బీర్కూర్ సొసైటీలో మెంబర్ అయిన చించొలి గ్రామానికి చెందిన బీర్కూర్ సుభాష్ మృతి చెందడంతో సుభాష్ బార్య బీర్కూర్ మీనాకు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ చెక్ అందజేశారు. కార్యక్రమంలో బీర్కూర్ సొసైటీ చైర్మన్ గాంధీ, బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అశోక్, కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజి రెడ్డి, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వీరేశం, మండల యూత్ ప్రెసిడెంట్ శశికాంత్, శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.