నిజాంసాగర్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ సొసైటీ ఆధ్వర్యంలో గోర్గల్ గ్రామంలో మల్లూరు సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, కళ్యాణి విఠల్ రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్ కలసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు. అనంతరం హమాలీలకు కరోనా నేపథ్యంలో శానిటైజర్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు మహేందర్, సర్పంచులు ఖాసీం, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, కమ్మరి కత అంజయ్య, పిరిని అంబవ్వ, బంజా కంసవ్వ, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఎంపీడీవో తోట పర్బన్నా, తహసీల్దార్ నారాయణ, నాయకులు రమేష్ కుమార్, బాబు సెట్, అప్జల్, సొసైటీ సీఈఓలు సంగమేశ్వర్, సాయిలు, సొసైటీ వైస్ చైర్మన్ గొట్టం నర్సింలు తదితరులు ఉన్నారు.