కామరెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గరుడ యాప్ గురించి మండల స్థాయిలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం తహసిల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నవంబర్ 6,7,27,28 వ తేదీలలో బూత్ లెవల్‌లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జనవరి 1, 2022 నాటికి ప్రమాణికంగా తీసుకొని అప్పటివరకు పద్దెనిమిదేళ్లు నిండిన కొత్త ఓటర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
మృతిచెందిన వారి పేర్లను, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించాలని పేర్కొన్నారు. నవంబర్ 30 వరకు ఓటర్ల జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఆర్డిఓ శీను, తహసీల్దార్లు పాల్గొన్నారు.