కామారెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్‌లో గురువారం రుణ విస్తీరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఈ ఏడాది రూ. 556 కోట్ల రూపాయల లక్ష్యం ఉండగా రూ.433 కోట్ల లింకేజీ రుణాలు ఇచ్చి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. మహిళలు తీసుకున్న రుణాలు వాయిదా పద్ధతిలో సకాలంలో చెల్లించడం వల్ల వారికి బ్యాంకులు రెట్టింపు రుణాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
రైతులు పంట రుణాలు సకాలంలో చెల్లించాలని కోరారు. రుణ విస్తరణ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల ముంగిట్లోకి బ్యాంక్ అధికారులు వస్తున్నారని తెలిపారు. గత ఏడాది కోవిడ్ సమయంలో బ్యాంకు సేవలు అందించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. జిల్లా మహిళా సమాఖ్యకు, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. 16 బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు.
సమావేశంలో మునిసిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, కెనరా బ్యాంక్ ఎజిఎం శ్రీనివాస రావు, ఎస్‌బిఐ ఏజీఎం పల్లంరాజు, డిజిఎం శేఖర్, యుబిఐ డిజియం నరేంద్ర కుమార్, టిజిబి ఆర్. ఎం. నారాయణ, నాబార్డ్ డి పి ఎం నగేష్, డిసిసిబి సీఈవో గజానంద్, లీడ్ బ్యాంక్ ఎల్‌డిఎం రాజేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.