ఉదయం 8 కల్లా ఫీల్డ్‌లో వెళ్ళాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌ సిబ్బంది అధికారులు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఫీల్డ్‌లో వెళ్లాలని లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్‌పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్‌ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు తప్పక వాక్సిన్‌ తీసుకోవాలని, జిల్లాలో 350 టీమ్‌లు తిరుగుతున్నాయని, ప్రతి రోజు జిల్లా టార్గెట్‌ 36 వేలు ఉండగా గురువారం కేవలం 16 వేలు మాత్రమే పూర్తి చేయడం ఎంత మాత్రం సరి కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది కావున టార్గెట్‌ పూర్తి చెయ్యాలని, అధికారులు అన్ని పనులు ప్రక్కన పెట్టి వ్యాక్సిన్‌పై పనిచేయాలని సూచించారు.

గ్రామ, మండల స్పెషల్‌ అధికారులు ప్రతి ఒక్కరు సమయ పాలన పాటించాలని లేనిచో వారిపై కఠిన చర్యలు పేర్కొన్నారు. కొన్ని మండలాల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారి డేటా కోవిన్‌ ఆప్‌లో అప్‌లోడ్‌ చేయలేదని వెంటనే దాన్ని పూర్తి చేసి 100 శాతం వ్యాక్సిన్‌ పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రోగ్రెస్‌ చాలా తక్కువగా ఉన్నదని కావున ప్రతి టీం 100 మందికి తక్కువ కాకుండా వాక్సిన్‌ వెయ్యాలని మెడికల్‌ అధికారులను ఆదేశించారు.

ఎంపిడిఓలు వ్యాక్సిన్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టి ప్రతి ఒక్కరు టీం వర్క్‌ చేసి పూర్తి చెయ్యాలి, లేకుంటే కఠినంగా చర్యలు వుంటాయన్నారు. అందరూ వ్యాక్సినేషన్‌ కంపల్సరీ వేయించుకోవాలని అప్పుడే మనం మూడవ వేవ్‌ రాకుండా అడ్డుకొని నిలబడగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ మకరంద్‌, డిఆర్‌డిఓ చందర్‌ నాయక్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌ నాయక్‌, ఇంచార్జి డిఎం అండ్‌ హెచ్‌ఓ సుదర్శన్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »