నిజామాబాద్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో 2017 తర్వాత జరిగిన టీచింగ్ (పార్ట్ టైం లెక్చరర్, అకడమిక్ కన్సల్టెంట్), నాన్-టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌కి పి.డి.ఎస్.యు గా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకుడు ఎం.నరేందర్ మాట్లాడుతూ 2017 లో జరిగిన అవుట్‌సోర్సింగ్ నియామకాలు రద్దు చేసిన తర్వాత అప్పటి వీసీ సాంబయ్య రిటైర్మెంట్ అయ్యే సమయంలో యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు జరిపారన్నారు.
వాటితోపాటు నేటి వరకు టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకాల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలని, అక్రమ నోటిఫికేషన్‌లు రద్దు చేయాలని కోరామన్నారు. యూనివర్సిటీలో అకడమిక్ వాతావరణాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ని కలిసిన వారిలో పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. నాగేశ్వర రావు, రాష్ట్ర కోశాధికారి మహేష్ తదితరులు ఉన్నారు.