ఆర్మూర్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఆర్మూర్ పట్టణ మేరు సంఘభవనంలో రాష్ట్ర మేరు సంఘం నవంబర్ 7 వ తేది ఆదివారం రోజు నిర్వహించబోయే దసరా దీపావళి ఆత్మీయ సమ్మేళనం వివాహా పరిచయ వేదిక, మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర మేరు సంఘం ఉపాధ్యక్షులు పోల్కం గంగాకిషన్ హాజరై మాట్లాడుతూ మహాసభకు మేరు కులస్థులు పెద్దఎత్తున తరలివచ్చి మేరు కులవృత్తి దారుల న్యాయమైన డిమాండ్లు సాధించుకుందామన్నారు.
కార్యక్రమంలో జిల్లా మేరు సంఘం అధ్యక్షులు సోమ హన్మంతరావు, కార్యదర్శి దేవదాస్, కోశాదికారి చంద్రకాంత్, నిజామాబాద్ నగర అధ్యక్షులు దశరథ్, ఆర్మూర్ అద్యక్షులు రవినాత్, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి గంగాధర్, బాల్కొండ, భీంగల్, మోర్తాడ్, నందిపేట్, మండలాల అధ్యక్షులు, కులసోధరులు పాల్గొన్నారు.