డిచ్‌పల్లి, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆద్వర్యంలో రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ యన్. ఐ.యస్.యస్, హైదరాబాద్-508 ఆదేశాల ప్రకారం శుక్రవారం యన్.యస్.యస్ సెల్ తెలంగాణ విశ్వవిద్యాలయ ఆద్వర్యంలో డిచ్‌పల్లి మార్కేట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో 200 మంది వాలంటీర్లు క్లీన్ ఇండియా నిర్వహించారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రతి యూనిట్ నుండి 20 మంది వాలంటీర్లు, యస్.పి.ఆర్ డిగ్రీ కళాశాల నుండి 200 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. మార్కేట్, బస్టాండ్ ప్రాంతాలలో వాలంటీర్లు శుభ్రం చేశారు. కార్యక్రమ ఉద్దేశ్యాన్ని యన్.యస్.యస్ సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ బాయి, వాలంటీర్లు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యన్.యస్.యస్ రీజినల్ అఫిస్ నుండి సైదానాయక్ హాజరయ్యారు. అలాగే ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వప్న, డాక్టర్ టి సంపత్, యన్.యస్.యస్ జూనియర్ అసిస్టెంట్ సురేష్, యస్.పి.ఆర్ డిగ్రీ కళాశాల ముత్యం, తెలంగాణ విశ్వవిద్యాలయ పి.ఆర్.ఓ డాక్టర్ ఎమ్.డి అబ్దుల్ కవి, బస్టాండ్ కంట్రోలర్ చందు పాల్గొన్నారు.