యువత వ్యాక్సిన్‌ తాము తీసుకొని, ఇతరులకు ఇప్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు యువత కోవిడ్‌ వ్యాక్సిన్‌ తాము తప్పకుండా ముందుకు వచ్చి తీసుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని వారిని చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఉద్బోధించారు.

శుక్రవారం ఆయన 14 వ డివిజన్‌ పరిధిలోని అర్సపల్లి, భగత్‌ సింగ్‌ కాలనీలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులకు వ్యాక్సిన్‌ చేస్తున్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి వ్యాక్సినేషన్‌ పై మాట్లాడారు.

జిల్లాలో రెండో విడత కరోనా విలయ తాండవం చేసిందని ఎంతో మంది కుటుంబాలకు చేదు జ్ఞాపకాలను, దుఃఖాన్ని మిగిల్చిందని తెలిపారు. ఆ సమయంలో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వేల పాజిటివ్‌ కేసులు వచ్చాయని ప్రతిరోజు 1300 నుండి 1460 పేషెంట్లు ఆసుపత్రులలో చేరినారని, రోజుకు పదిహేను వందల ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం ఉండగా కేవలం 250 సిలిండర్ల తోనే సేవలు అందించడం ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొన్నామని ఎంతో మంది ప్రాణాలు కూడా ఈ మహమ్మారి బలి తీసుకుందని పేర్కొన్నారు.

దీనికి పరిష్కారం కేవలం వ్యాక్సిన్‌ తీసుకోవడమే అని, వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా వచ్చినప్పటికీ ప్రాణాపాయం ఉండదని ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘ రోగ గ్రస్తులు వైరస్‌కు సులభంగా ఆకర్షితులు అవుతారని, తద్వారా వారికి చాలా ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకోవచ్చని ఎటువంటి సమస్యలు రావని కేవలం డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే సర్జరీలు అయినవారు మూడు నెలల వరకు వాయిదా వేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నారని ఇది ఒక మంచి అవకాశమని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వయసు వారు 11.5 లక్షల మంది ఉన్నారని వీరిలో ఇప్పటికే 8 లక్షల 50 వేల మందికి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేశామని నవంబర్‌ 3వ తేదీలోగా మిగతా మూడు లక్షల మందికి వ్యాక్సినేషన్‌ వేయించే ప్రక్రియలో విద్యార్థులు యువత భాగస్వాములై ముందుకు రాని ప్రజలకు, కుటుంబ సభ్యులకు, మీ ఇంటి పరిసరాల చుట్టుపక్కల ప్రజలకు, బంధువులకు, మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకారం అందించి తమ వంతు పౌరులుగా బాధ్యతలను నెరవేర్చాలని విద్యార్థులుగా ఇది మీ ధర్మం కూడా అని సూచించారు.

కార్యక్రమాల్లో ఇన్చార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, ఇంచార్జ్‌ డిఎం హెచ్‌ఓ సుదర్శనం, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »