నిజామాబాద్, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లెప్రసి రోగులకు మాస్కులు శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లెప్రసి వార్డులో పంపిణి చేశామని లెప్రసి వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత రెండు సంత్సరాలుగా ప్రాణాలతో వెంటాడుతూ మహమ్మారి కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు రోగాన పడకుండా మాస్కులు ధరించి ప్రాణాలను సురక్షితంగా కాపాడుకోవాలని లెప్రసి రోగులకు మాస్కులు పంపిణి చేశామని ఆయన అన్నారు.
ప్రతి రోజు లెప్రసి రోగులకు చికిత్స అందిస్తూ పౌష్టిక ఆహారం తినాలని మద్యానికి మత్తుపదార్థాలకు బానిస కాకూడదని రోగులకు తగు జాగ్రతలు సూచనలు ఇస్తున్నామని తెలిపామన్నారు. కార్యక్రమంలో దర్పల్లి లెప్రసి సూపర్ వైసర్ లెప్రసి స్టాఫ్ నర్స్ పరిమళ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.