కామారెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు పౌష్టికాహారం అందేవిధంగా ప్రధానోపాధ్యాయులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం వీడియో కాన్ఫరెన్సులో మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు.
ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని వంటశాలలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. పరిశుభ్రమైన పాత్రలలో మధ్యాహ్న భోజనం, కూరలు వండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దాతల సహకారంతో వంట సామాగ్రిని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా విద్యాధికారి రాజు, ఆర్డిఓ శీను, మండలాల విద్యాధికారులు పాల్గొన్నారు.