Monthly Archives: October 2021

ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ను కలిసిన పి.డి.ఎస్‌.యు నాయకులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో 2017 తర్వాత జరిగిన టీచింగ్‌ (పార్ట్‌ టైం లెక్చరర్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌), నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కి పి.డి.ఎస్‌.యు గా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్‌.యు రాష్ట్ర నాయకుడు ఎం.నరేందర్‌ మాట్లాడుతూ 2017 లో జరిగిన అవుట్‌సోర్సింగ్‌ నియామకాలు రద్దు చేసిన తర్వాత అప్పటి …

Read More »

జివో 60 ప్రకారం వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి జీవో నెంబర్‌ 60 ని వర్తింపచేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపు నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా డిచ్‌పల్లి కేజీబీవీ ముందు నిరసన ప్రదర్శన చేశారు. …

Read More »

పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా బాల శ్రీనివాస మూర్తి

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం డైరెక్టర్‌గా తెలుగు అధ్యయన విభాగం అసోసియేట్‌ ప్రోఫ్రెసర్‌ డాక్టర్‌ జి. బాల శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ గుప్తా ఆదేశాలమేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య పి. కనకయ్య బుధవారం డాక్టర్‌ బాల శ్రీనివాస మూర్తికి నియామక పత్రాన్ని అందచేశారు. తనకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా భాద్యతలు అప్పగించడంపై …

Read More »

అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విలేజ్‌ లెవెల్‌ మల్టీ డిసిప్లీనరీ టీములు ప్రతి ఇంటిని సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంపీవోలతో నిర్వహించిన టెలి కాన్పరెన్సులో మాట్లాడారు. ఇటీవల ఇతర దేశాలలో కరోనా కేసులు నమోదవుతున్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వారం రోజుల్లోగా అర్హులైన …

Read More »

శర వేగంగా రోడ్డు విస్తరణ పనులు

భీమ్‌గల్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మున్సిపల్‌ కేంద్రంలోని పుణ్యక్షేత్రం అయిన శ్రీ లింబాద్రి గుట్టపైన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, గిరి ప్రదక్షణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు లింబాద్రి జాతర ప్రారంభం అయ్యే సమయం వరకు నాలుగు లైన్ల రోడ్డు, సెంటర్‌ లైటింగ్‌, గ్రినరి రోడ్డు పనులు పూర్తి కావాలని సూచించారు. ఆయా …

Read More »

కామారెడ్డి నడిబొడ్డున చైన్‌ స్నాచింగ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. వివరాల్లోకి వెళితే లక్ష్మి అనే మహిళ ఎర్రపహాడ్‌ గ్రామ పిహెచ్‌సి సెంటర్‌లో విధులు నిర్వహించుకొని కామారెడ్డిలో ఉన్న తన నివాసానికి అతిసమీపంలో లక్ష్మీ మెడలో నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌ పై వచ్చి రెండున్నర తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని …

Read More »

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడటంతోపాటు చట్టప్రకారం వారికి రావలసిన బెనిఫిట్స్‌ వీలైనంత తొందరగా ఇప్పించాలని, మరోవైపు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నదని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో, బీర్కూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులు పండిరచిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని …

Read More »

దాతల సహకారంతో పాఠశాలకు వంట పాత్రలు…

వేల్పూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం మోతే ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు 23 వేల 400 రూపాయల విలువైన మధ్యాహ్న భోజన వంట పాత్రలను మోతే గ్రామానికి చెందిన నక్క మోహన్‌ యాదవ్‌, ఎస్‌ఎన్‌ అఫ్రోజ్‌ వితరణ చేశారు. ఈ సందర్భంగా మోతే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగన్న మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన నక్క మోహన్‌ యాదవ్‌ వారి తండ్రి …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను టిఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులను సర్పంచ్‌ శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు, టిఆర్‌ఎస్‌ నాయకుల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చొరవతో అనారోగ్యంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »