నిజామాబాద్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం మొత్తం విద్యార్థులు 17,752 మందికి గాను 16,629 హాజరయ్యారు. జనరల్ 15990 మంది విద్యార్థులకు గాను 899 మంది విద్యార్థులు గైర్హాజర్ కాగా 15,980 మంది విద్యార్థులు హాజరయ్యారు.
అలాగే ఒకేషనల్ మొత్తం విద్యార్థులు ఒక వెయ్యి 772 మందికి గాను 1548మంది విద్యార్థులు హాజరుకాగా, 224 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు. కాగా జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ 5 పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసి పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, శ్రీ మేధావి జూనియర్ కళాశాల, కాకతీయ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
అలాగే హైపవర్ కమిటీ చిన్నయ్య ఆధ్వర్యంలో 5 పరీక్ష కేంద్రాలు, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, చిరంజీవి, కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో 9 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ నారాయణ ఆధ్వర్యంలో 10 పరీక్ష కేంద్రాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 18 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
పరీక్షల నిర్వహణలో సిబ్బంది పూర్తిస్థాయిలో పకడ్బందీగా పనిచేశారని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘు రాజు తెలిపారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన పోలీస్ విభాగము, రెవెన్యూ విభాగం అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ఆర్టీసీ అధికారులకు జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ కృతజ్ఞతలు తెలిపారు.