నవీపేట్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా ఎందరో ఉపాధి కూలీల కడుపుకొట్టడంతో చాల మంది పనులు లేక విలవిలలాడిపోయారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పడడంతో కూలీలకు చేతినిండా ఉపాధి లబిస్తుంది.
ముఖ్యంగా ఉపాధి కోసం కొందరు యువకులు బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి తెలుగు రాష్ట్రాలవైపు రావడం ఇక్కడ ధాన్యం నింపడం, ఎత్తడం వంటి పనులలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఒక్కో ధాన్యం బస్తాకి రైతులు 13 నుండి 14 రూపాయలు చెల్లిస్తున్నారని 3 నెలల పటు చేతినిండా పని లబిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.