నందిపేట్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేదలు తమకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రోసీడిరగ్ కాఫీతో రెవెన్యూ కార్యాలయంలో ఇల్లకోసం ప్రభుత్వ భూమిని చూపించాలని తల్వేద గ్రామ నిరుపేదలు ఎమ్మార్వో అనిల్‌కు వినతిపత్రం ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు.
ఎమ్మార్వో అనిల్ మాట్లాడుతూ తల్వేద గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటే సర్వే చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు తమకు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఇర్నపల్లి నరేష్ గౌడ్, నవీన్ చారి, గంగాధర్, సాగర్, వెంకట్, గంగామని, భూమ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.