ఆర్మూర్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణపరిదిలో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా పట్టణ పరిసర ప్రాంత శాఖల అధ్వర్యంలో అవినీతి నిర్మూలన వారోత్సవాలలో బాగంగా సోమవారం ఆర్మూర్ నుండి మామిడిపల్లి గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం నిజామాబాద్ ప్రాంతీయ అధికారి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించడం, అవినీతి రహిత భారతదేశం నిర్మించడం, 75 సంవత్సారాల ఆజాదీకా అమృత్ మహోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎజిఎం నటరాజ్, మిన్నయ్య, విజయ్ కుమార్, నిఖిల్, మనోజ్ సింగ్, అనిల్ కుమార్, భరత్ భూషణ్, భూపాల్, ఆర్మూర్ పరిసరప్రాంత 15 శాఖల సిబ్బంది పాల్గొన్నారు.