కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెవిన్యూ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి లు పేర్కొన్నారు.
అనంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను కలిశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రవీందర్, కోశాధికారి వరప్రసాద్, అసోసియేట్ అధ్యక్షుడు రంజిత్ కుమార్, నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.