కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30 లోగా మిల్లింగ్ పూర్తిచేయాలని సూచించారు. యాసంగిలో కొనుగోలు చేపట్టిన ధాన్యంలో 30 శాతం మిల్లింగ్ పూర్తయినట్లు చెప్పారు. సమావేశంలో ఆర్డివోలు రాజా గౌడ్, శీను, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఇంచార్జ్ డిఎల్‌ఎస్‌వో రాజశేఖర్, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.