నందిపేట్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశామని ప్రధానోపాధ్యాయులు జాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్థులకు తెలిపామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 208 మంది పిల్లలు ఉన్నారని వారికి విద్య బోధించడానికి ఉపాధ్యాయుల కొరత ఉందని తరగతి గదులు కొరత ఉందని పిల్లలు తల్లిదండ్రులకు వీడీసీ సభ్యులకు తెలిపారు.
గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నలుగురు ఉపాధ్యాయులను నియమించుటకు జీతభత్యాలు గ్రామాభివృద్ధి కమిటీ నుండి ఇస్తామని తెలిపినట్లు చెప్పారు. అదనపు గదుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దగ్గరికి తల్లిదండ్రులను తీసుకెళ్తామని ఉప సర్పంచ్ రెడ్డి తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యా కమిటీ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ పేదోడి భవిష్యత్తు మారాలంటే విద్యా వ్యవస్థనే కారణమని ప్రతి పేదవాడు విద్యావంతులు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.
కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, ఉపాద్యాయ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, ఎంపిటీసి లింగం, ఉపసర్పంచ్ సాయరెడ్డి, వీడీసీ సభ్యులు, మన ఊరు మన భాద్యత వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.