కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణిలో పెండిరగ్లో ఉన్న ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలోని తన చాంబర్ నుంచి తహసిల్దార్లతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు.
రాజంపేటలో 15, మాచారెడ్డిలో 13 పెండిరగ్లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఎల్.ఎం.లో పెండిరగ్ మ్యుటేషన్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. టెలీ కాన్పరెన్సులో కలెక్టరేట్ ఏవో రవీందర్, ఆర్డివోలు రాజా గౌడ్, శీను, తహసీల్దార్లు పాల్గొన్నారు.