ఎల్లారెడ్డి, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మామిడి లక్ష్మినారాయణ గత కొన్ని రోజుల క్రితం బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ని సంప్రదించి జరిగిన ప్రమాదం గురించి చెప్పగా వెంటనే స్పందించి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
బుధవారం అతని చికిత్స కొరకు ఖర్చులకు మూడు లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కుని స్వయంగా ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంభానికి అందించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ లక్ష్మి నారాయణకి మెరుగైన చికిత్స అందేలా చూస్తానని, వారికి అండగా తానున్నాని ధైర్యం చెప్పారు.