వేల్పూర్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. రైతులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఖచ్చితంగా రైతులకు కొనుగోలు అయినటువంటి 44 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుందని డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు.
వేల్పూర్ మండలం సొసైటీ ఆధ్వర్యంలో లక్కోరా గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎటువంటి అపోహలు భయము పెట్టుకోవద్దని వరి కొనుగోలు కేంద్రంలో రైతు వరి అమ్మకాలు జరగగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, రైతు తాలు లేకుండా నాణ్యమైన వరిని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తద్వారా 1960రూ, 1940రూ 16 మ్యాచర్‌ని బట్టి విలువ కట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
రైతులు అందరూ సహకరించాలని వేల్పూర్ మండల రైతులను కోరారు. కార్యక్రమంలో లక్కోర, ఆమీనాపూర్ రెడ్డి స్ధానిక సర్పంచ్‌లు ఆకుల రాజేశ్వర్, వంశీ లక్కోర, అమీనాపూర్ ఎంపిటిసి ఈర్మ గంగామణి, సొసైటీ వైస్ చైర్మన్ అగ్రికల్చర్ ఎవో నర్సయ్య, స్ధానిక సర్పంచ్‌లు ఆకుల రాజేశ్వర్, వంశీ, ఈర్మ గంగామణి ఐకేపి ఎపియం కిరణ్, ఎఇవో సిసిలు, మురళి, రైతులు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.