కార్మికుల పట్ల ప్రభుత్వ వివక్ష అన్యాయం

నిజామాబాద్‌, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్‌ నెల నుండి వేతన పెంపు అమలు చేసేలా కార్పొరేషన్‌ పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐఎఫ్‌టియు, ఏఐటియుసి మున్సిపల్‌ యూనియన్ల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు భారీ ధర్నా జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌, తెలంగాణ మున్సిపల్‌ స్టాఫ్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటియుసి) జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు పి.సుధాకర్‌ మాట్లాడారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకారం వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు పెంచకపోవడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంచుతూ జూన్‌ నెలలో జీవో నెంబర్‌ 60 ని విడుదల చేసిందన్నారు. జీవో ప్రకారం వివిధ కేటగిరీల వారీగా మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెరగాల్సి ఉండగా, నేటికీ అమలు కాకపోవడం దుర్మార్గమన్నారు.

వెంటనే కేటగిరీల వారీగా వేతనాలు పెంచుతూ వచ్చిన జీవో నంబర్‌ 60ని మున్సిపల్‌ కార్మికులకు అమలు చేయాలని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకమండలి తీర్మానం చేయాలన్నారు. అదేవిధంగా ఇటీవల కొత్తగా నియమించబడిన మున్సిపల్‌ కార్మికులు, డ్రైవర్లకు వేతనాలు పెండిరగ్‌ ఉన్నాయని, వారందరికీ వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. కార్మికులందరికీ ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వచ్చేట్టు చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం జీవో నెం. 60 అమలు కోసం మున్సిపల్‌ పాలకవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపి, వేతనాల పెంపు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కమిషనర్‌ చిత్రా మిశ్రాకి, మేయర్‌ నీతూ కిరణ్‌కి వినతి పత్రం అందజేశారు. తప్పకుండా ఈ డిమాండును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అతి త్వరలోనే వేతనాల పెంపు అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐ.ఎఫ్‌.టి.యు, ఏఐటీయూసీ మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు రాజేశ్వర్‌, నర్సింగరావు, సాయి, మల్లేష్‌ శివకుమార్‌, గోవర్ధన్‌, కిరణ్‌, టి.విఠల్‌, గోపి, లక్ష్మణ్‌, తిరుపతి,కళావతి, వరలక్మి, లక్ష్మీ, యాదమ్మ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »