8 నుండి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 8వ తేదీ నుండి పోడు భూములు సాగుచేస్తున్న రైతులనుండి క్లెయిమ్స్‌ దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి పోడు భూములు, వ్యాక్సినేషన్‌పై మండల స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సోమవారం నుండి మొదటి విడత ఎఫ్‌ఆర్‌సి కమిటీలు సంబంధిత గ్రామాలలో పర్యటించి క్లెయిమ్స్‌పై అవగాహన కల్పించాలని సంబంధిత దరఖాస్తు ఏ విధంగా పూర్తి చేయాలో, క్లెయిమ్‌ దరఖాస్తులతో జతచేయవలసిన ఆధారాల ధ్రృవపత్రాల గురించి వివరించాలని తెలిపారు. ఎఫ్‌ఆర్‌సి కమిటీలు క్లెయిమ్స్‌ దరఖాస్తులు తీసుకోవాలని, వాటి వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని, ప్రతి హ్యాబిటేషన్‌లో మూడు రోజుల తర్వాత రెండవసారి విజిట్‌ చేయాలని తెలిపారు.

సింపుల్‌గా క్లెయిమ్‌ దరఖాస్తుల సేకరణ ప్రారంభించాలని, ఇందుకు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాలని సూచించారు. ఇకముందు అటవీ ఆక్రమణ జరుగకుండా కమిటీలతో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. యండివోలు ఎఫ్‌ఆర్‌సి కమిటీలను ఏర్పాటు చేయాలని, తహసిల్దార్‌లు గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ నిబంధనలు, ఎఫ్‌ఆర్‌సి కమిటీ నిబంధనలు క్లియర్‌గా అందరికీ తెలిసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఎఫ్‌ఆర్‌సి కమిటీలను హాబిటేషన్‌ వారీగా, పది నుండి పదిహేను మంది సభ్యులు ఉండే విధంగా చూడాలని, ఎస్‌టిలు1/3 వంతు ఉండాలని స్త్రీలు 1/3 వంతు ఉండాలని తెలిపారు.

వెంటనే కమిటీలను ఫామ్‌ చేసి పంపాలన్నారు. 135 గ్రామ కమిటీలను తహసిల్దార్‌ ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం నుండి హ్యాబిటేషన్‌లలో మొదటి విడత విజిట్‌ చేసి అవగాహన కల్పించాలన్నారు. అర్హత ప్రకారంగా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో టీం షెడ్యూల్‌ ప్రిపేర్‌ చేయాలన్నారు. మండల్‌ స్పెషల్‌ ఆఫీసర్లు రివ్యూ నిర్వహిస్తూ వచ్చిన క్లెయిమ్స్‌ రిపోర్ట్స్‌ సమర్పించాలని తెలిపారు.

వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి కావాలన్నారు. ఆశా వర్కర్ల వారీగా రిపోర్టు లిస్ట్‌ ప్రిపేర్‌ కావాలన్నారు. కోవిన్‌ యాప్‌లో వాక్సినేషన్‌ వివరాల వ్యత్యాసాన్ని సరి చేయాల్సిందిగా ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్‌, డిఎఫ్‌ఓ సునీల్‌, డిపిఓ జయసుధ, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి నాగోరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »