నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 8 సోమవారం నుండి పోడు భూములకు సంబంధించి పోడు భూముల రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ దిశగా ఇప్పటికే నియమించిన కమిటీలు ఆయా గ్రామాలలో, హ్యాబిటేషన్‌లలో పర్యటించి ప్రజలకు పోడు భూములపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారని వీటిలో ఎవరు అర్హులు, ఏ విధంగా దరఖాస్తు చేయాలి, చట్టం ఏం చెబుతోంది, ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయో దరఖాస్తుతోపాటు ఏయే ధృవ పత్రాలు, ఆధారాలు సమర్పించాలి తదితర విషయాలను కూడా వివరిస్తారని ఆయన తెలిపారు.
పోడు భూములు సాగుచేస్తున్న రైతులు తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలకు హాజరై అన్ని విషయాలను అర్థం చేసుకొని వారి అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవడానికి పరిశీలించాలని అన్ని వివరాలను, అర్హతలను అవగాహన కార్యక్రమాలలో అడిగి తెలుసుకోవాలని ప్రకటనలో కలెక్టర్ కోరారు.