నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని సోషియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే అన్నారు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధం అని సూచించారు. కుల, మత, వర్గ, వర్ణ, రాజకీయ, లింగ వివక్ష ఉండకూడదన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రయివేటు ఉద్యోగులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.
నిర్భయ చట్టం, దిశా చట్టం, ఫోక్సో చట్టం, బాలల హక్కులు, అవినీతి, అక్రమాల గురించి అవగాహన కల్పించారు. తెలంగాణా రాష్ట్ర ఛైర్మన్ మామిడాల మనోహర్ మాట్లాడుతూ హక్కుల ఉల్లంఘనకు గురైన భాదితులకు తాము అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలు వేసి, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామన్నారు.
రాజ్యాంగం ప్రకారం మానవ హక్కుల కోసం ఉన్న చట్టాల గురించి తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వారికి గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర వైస్ ఛైర్మన్ అబ్దుల్ ఫర్వేజ్, రాష్ట్ర డైరెక్టర్ నజీమోద్దీన్, నిజామాబాద్ జిల్లా ఛైర్మన్ యూ.నాగరాజు, వైస్ ఛైర్మన్ హన్మగౌడ్, జిల్లా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, బాల్కొండ నియోజకవర్గ చైర్మన్ జి.నర్సగౌడ్, బాల్కొండ నియోజకవర్గ బీసీ చైర్మన్ గుండు నాగరాజు, సిద్దిపేట జిల్లా మహిళా విభాగం ఛైర్మన్ హేమలత, లీగల్ అడ్వైజర్లు, అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.