Daily Archives: November 8, 2021

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి..

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌కి, మున్సిపల్‌ కమిషనర్‌కి బీజేపీ కౌన్సిలర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు యథేఛ్ఛగా సాగుతున్నాయని, అదే విధంగా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడ విలయతాండవం చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్‌ చొరవ …

Read More »

ఘనంగా రేవంత్‌రెడ్డి జన్మదినం

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండి కాంగ్రెస్‌ పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన పిసిసి …

Read More »

వేల్పూర్‌ మినీ స్టేడియంలో క్రీడా పోటీలు

వేల్పూర్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌జిఎఫ్‌ఐ రూరల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో గల మినీ స్టేడియం లో వాలీబాల్‌, కబడ్డీ, కోకో క్రీడలు జిల్లా స్థాయి సెలక్షన్స్‌, టోర్నమెంట్‌ నిర్వహించారు. ఆర్‌జిఎఫ్‌ఐ నిజామాబాద్‌ రూరల్‌ గేమ్స్‌ అధ్యక్షుడు అబ్బగోని అశోక్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు మానసికంగా శారీరకంగా ఉల్లాసం ఇస్తాయని, …

Read More »

అక్రమ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను రద్దు చేయాల్సిందే

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల తొలగింపులో స్పష్టత ఇవ్వాలని, అక్రమ నియామకాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌కు పిడిఎస్‌యు, పివైఎల్‌, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీ.వై.ఎల్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్‌ మాట్లాడారు. యూనివర్సిటీలో అక్రమ టీచింగ్‌, నాన్‌ …

Read More »

ఏం చేసినా ర్యాడ మహేష్‌ రుణం తీర్చుకోలేము

వేల్పూర్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణలో తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీర జవాన్‌ మహేష్‌ కుటుంబానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. దేశ రక్షణలో సంవత్సరం క్రితం ఆయన తన ప్రాణాలను అర్పించిన నేపథ్యంలో ఒక సంవత్సరం పూర్తయినందున సోమవారం ఆయన స్వగ్రామం కొమన్‌పల్లిలో ఆయన …

Read More »

తీన్మార్‌ మల్లన్నకు బెయిల్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తీన్మార్‌ మల్లన్నకు హైకోర్టులో బెయిల్‌ రావడంపై తెలంగాణ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల పక్షాన ప్రశ్నించే జర్నలిస్టులకు రక్షణ లేదు అనడానికి తీన్మార్‌ మల్లన్న పరిస్థితి నిదర్శనమన్నారు. అవినీతి, అక్రమాలను బయట పెట్టడం జరిగినప్పుడు ప్రభుత్వం, మంత్రులు స్పందించి వాటిని పెంచి …

Read More »

తెలంగాణ ఏకనామిక్స్‌ అసోసియేషన్‌ కాన్ఫరెన్సు విజయవంతం చేయండి

డిచ్‌పల్లి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 12, 13 2022 న తెలంగాణ ఏకనామిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాన్ఫరెన్సు విజయవంతం చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గుప్త పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో కాన్ఫరెన్సుకు సంబంధించిన బ్రోచర్‌ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ఎకనామిక్‌ అసోసియేషన్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జరగబోయే సమావేశంలో …

Read More »

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోని పాలకులు

బోధన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో పాలక వర్గ పార్టీలు విఫలం అవుతున్నాయని ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి బి. మల్లేష్‌ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం బోధన్‌ పట్టణం ఉర్దూగర్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి. మల్లేష్‌ మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికై వసూలు చేసిన సెస్సు వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నప్పటికీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »