అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి..

కామరెడ్డి, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌కి, మున్సిపల్‌ కమిషనర్‌కి బీజేపీ కౌన్సిలర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు యథేఛ్ఛగా సాగుతున్నాయని, అదే విధంగా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడ విలయతాండవం చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

ఇకనైనా జిల్లా కలెక్టర్‌ చొరవ చూపి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వార్డుల సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌కి కూడా పిర్యాదు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటూరి శ్రీకాంత్‌, కౌన్సిలర్లు సుజిత భరత్‌, అవదూత నరేంధర్‌, సుతారి రవి, పండ్ల ప్రవీణ్‌, బీజేపీ నాయకుడు సురేష్‌ పాల్గొన్నారు.

Check Also

భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »