కామారెడ్డి, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండి కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ మెరుగుపడుతుందని, రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, గుడ్ల శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, సదశివానగర్ యూతకాంగ్రెస్ అధ్యక్షులు కోతి లింగారెడ్డి, ధాత్రిక సత్యం, సర్వర్, లక్క పత్తిని గంగాధర్, హనుమండ్ల, సంతోష్ పాటిల్, హనుమండ్ల రవి, మామిడి అశోక్ రెడ్డి, రావినాయక్, వేదనాథ్, గైని సురేశ్, సరంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమం నిర్వాహకురాలు భైరం శారద దేవి, శ్రీలక్ష్మి మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ల్యాండ్ ఇప్పించి తమకు సహకారంచాలని తెలిపారు.