వేల్పూర్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్‌జిఎఫ్‌ఐ రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో గల మినీ స్టేడియం లో వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడలు జిల్లా స్థాయి సెలక్షన్స్, టోర్నమెంట్ నిర్వహించారు. ఆర్‌జిఎఫ్‌ఐ నిజామాబాద్ రూరల్ గేమ్స్ అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
క్రీడలు మానసికంగా శారీరకంగా ఉల్లాసం ఇస్తాయని, క్రీడల వల్ల విద్యార్థులు అనేక రంగాలలో రాణించ గలుతారని తెలిపారు. అదేవిధంగా గెలుపోటములు సహజమని క్రీడల్లో ఓడినా గెలిచినా స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులను ఉత్సాహపరిచారు. రాబోయే కాలంలో ఆర్‌జిఎఫ్ ప్రతి గ్రామాలలో నుండి పేద వర్గాలకు చెందిన వారిని గుర్తించి వారిని సెలక్షన్స్‌కి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఏ క్రీడలోనైనా గెలవాలంటే ఒక క్రీడకు సంబంధించి నైపుణ్యం చాలా అవసరం అలాగే వారి యొక్క శిక్షకులు చెప్పినట్టు సాధన చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని పేర్కొన్నారు.
అదేవిధంగా ఆర్‌జిఎఫ్‌లో క్రీడలు ఆడినటువంటి తొమ్మిదిమంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీలలో ఉద్యోగాలు లభించాయని, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఒకరికి ఉద్యోగం లభించిందని తెలిపారు. ఇంకా కొంత మంది క్రీడాకారులకు వివిధ రకాల కాలేజీలో సీటు రావడం వివిధ రకాల ఉద్యోగాలు పొందారని చెప్పారు.
ఆర్‌జిఎఫ్ రూరల్ గేమ్స్ ఉమ్మడి నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి బూస మహేష్ మాట్లాడుతూ అండర్ 17 బాయ్స్, అండర్ 17 గర్ల్స్, అండర్ 19 బాయ్స్, అండర్ 19 గర్ల్స్ యొక్క క్రీడలను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మినీ స్టేడియంలో నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా వాలీబాల్, కబడి, కోకో క్రీడలకు దాదాపు చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల నుండి 300 మంది వరకు విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.
నవంబర్‌లో గజ్వేల్‌లో రాష్ట్ర ఆర్‌జెఫైవ్ క్రీడలు జరుగుతున్నాయని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మహారాష్ట్రలోని షిరిడీలో జరిగే జాతీయ స్థాయిలో పాల్గొంటారని ఆర్‌జిఏఫ్ ప్రధాన కార్యదర్శి బుస మహేష్ వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్‌జిఎఫ్ వైస్ చైర్మన్ బిఆర్ నరసింగ్ రావు, నిజామాబాద్ జిల్లా ఆర్‌జిఎఫ్ ఉపాధ్యక్షులు సంజీవ్, రాజలింగం, ప్రదీప్ అదేవిధంగా కోచులు రాజశేఖర్, అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.