రుద్రూర్, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామ పంచాయతీ పరిధి శివారులో ఉన్న మైనార్టీ రెసిడెన్సీ బాయ్స్ స్కూల్, గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, వంట సామాగ్రిని మంగళవారం (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ పాఠశాలలో వంటగదిని, వంట సామాగ్రిని పరిశీలించి మధ్యాహ్న భోజన ఏజెన్సీ వాళ్లతో, పాఠశాల ప్రిన్సిపాల్‌తో, స్థానిక ఉపాధ్యాయులతో, హాస్టల్ వార్డెన్‌తో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన కూరగాయలతో భోజనం అందించాలన్నారు. ప్రభుత్వం మెనూతో కూడిన ఆహారం వేడి వేడిగా వడ్డించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికి అప్పుడు నిత్యావసర సరుకులు, వంట నూనెలు, కారం, పప్పులు, గ్రుడ్లను తెపించుకోవాలని వారు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకులకు, హాస్టల్ వార్డెన్‌లకు స్థానిక ఉపాధ్యాయులకు తెలిపారు.
నాణ్యత లేని కూరగాయలు, ఇతర కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగించినట్లాయితే ప్రిన్సిపాల్‌పై, హాస్టల్ వార్డెన్‌పై శాఖపరమైన చర్యలు తప్పవని వారు అన్నారు. అదేవిధంగా ప్రతి రోజు విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ పరిశీలించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని ప్రధానోపాధ్యాయులకు వారు సూచించారు.
అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ ఎప్పటికి అప్పుడు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి మండల అధ్యక్షులు బాలకృష్ణ, ఉపాధ్యాయులు, వార్డెన్ తదితరులు ఉన్నారు.