డిచ్‌పల్లి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్య ప్రాంగణం డిచ్‌పల్లిలోని పాత బాలుర వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త ఆకస్మిక తనిఖీ చేశారు. తనికీలో భాగంగా వర్కర్లు అందరూ భాద్యతగా వ్యవరించాలని సూచించారు. తనికీలో భాగంగా వంటగదిని, వాటర్ ప్లాంట్, మెస్స్ గదిని, బియ్యాన్ని , ఇతర వస్తువులను పరిశీలించారు. ప్రస్తుతము విద్యార్థులు ఎంత మంది ఉన్నారని, వర్కర్స్ ఎంత మంది ఉన్నారు అని చీఫ్ వార్డెన్ డాక్టర్ జమీల్‌ను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుత వర్కర్స్ పనిభారం గురించి చర్చించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. తనికీలో చీఫ్ వార్డెన్ డాక్టర్ జమీల్, ఏ.ఇ వినోద్ కుమార్, కేర్ టేకర్, పిఆర్‌వో డాక్టర్ అబ్దుల్ ఖవి, తదితరులు ఉన్నారు.