డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తేనే రైతుకు ప్రయోజనం

నిజామాబాద్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు లాభసాటి, డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం ఖిల్లా, డిచ్‌పల్లి, ధర్మారంలలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తూకం వేస్తున్న విధానం, లారీల రవాణా సదుపాయం రైస్‌ మిల్లులలో ధాన్యం అన్‌లోడిరగ్‌ తదితర వివరాలను అధికారులను, రైతులను తెలుసుకున్నారు.

వ్యవసాయ అధికారి ఎఫ్‌ఎక్యూ సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాతనే కాంటా వేయాలని తెలిపారు. ఎఫ్‌ఏక్యూ, నాన్‌ ఎఫ్‌ఎక్యూ నమోదు చేసిన ధాన్యం రిజిస్టర్‌ పరిశీలించారు. మాయిష్చర్‌ బాగుందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం సెంటర్‌కు వరి ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడుతూ, రైతులు లాభసాటిగా, డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలని తెలిపారు.

వచ్చే సీజన్‌లో ప్రభుత్వం వరి ధాన్యం కొనే అవకాశాలు లేవని అందుకు రైతులు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను వేయాలన్నారు. వరి ధాన్యాన్ని బయట అమ్మే అవకాశం ఉంటేనే సాగుకు వెళ్లాలని సూచించారు. డిమాండ్లు లేనివి సాగు చేయడం వల్ల రైతులు నాలుగు నెలలు కష్టపడి పెట్టుబడి పెట్టి కోతల తర్వాత రోడ్డు మీదికి వచ్చి ఇబ్బంది పడొద్దు అని అన్నారు. ఒకప్పుడు సంవత్సరానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం పండిరచేవారని, కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుత నిజామాబాద్‌ జిల్లాలో ఒక్క గత సీజన్‌లోనే ఏడున్నర లక్షల పండిరచారని, ఈ విధంగా నిజామాబాద్‌ జిల్లాలోనే కాకుండా ప్రతి జిల్లాలో వేరే రాష్ట్రాలలో వరి పంట పెరిగిందని చెప్పారు.

ఇంతకుముందు బాయిల్డ్‌ రైస్‌ తీసుకునే కేరళ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలు కూడా ప్రస్తుతం వరి పండిస్తున్నందున తమకు అవసరంలేదని చెబుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు కరెంట్‌, నీళ్లు ఇస్తున్నది తమకు కూడా వరి వద్దని చెప్పడానికి బాధగానే ఉందని, రైతులు వరి పంట పండిరచి బాధ పడకూడదనే చెప్పాల్సి వస్తుంది అన్నారు. వరి ధాన్యం బయట అమ్మే అవకాశం ఉంటే పెట్టండి సీడ్‌ కొనే వారికి లేదా డిమాండ్‌ ఉన్న వెరైటీస్‌ డిమాండ్‌ ఉన్న వాటిని వేయండి, పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిసిఓ సింహాచలం, తహసిల్దార్‌ శ్రీనివాస్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ జైపాల్‌, పిఎసిఎస్‌ సీఈవో కిషన్‌, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »